మొయినాబాద్ మండలంలో కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్న సిఐ జానయ్య గారు.
రంగారెడ్డి జిల్లా :మొయినాబాద్ మండలంలో ఉన్న 2 చెక్ పోస్టుల వద్ద లాక్ డౌన్ నేపథ్యంలో
మొయినాబాద్ పోలీసులతో కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నామని మొయినాబాద్
సిఐ జానయ్య తెలిపారు...
మొయినాబాద్ సిఐ జానయ్య మాట్లాడుతూ లాక్ డౌన్ ను మొయినాబాద్ మండలంలో
ని 2 చెక్ పోస్టుల వద్ద కట్టుదిట్టంగా చేపడుతున్నామని అన్నారు..
ప్రతి ఒక్కరు సామాజిక దూరాన్ని పాటించాలని అన్నారు అనవసరంగా రోడ్లపైకి వస్తే
వాహనాల్ని సీజ్ చేసి కేసులు నమోదు చేస్తామని అన్నారు
ఇప్పటివరకు160వాహనాలు సీజ్ చేసినట్లు తెలిపారు
అత్యవసర మరియు వ్యవసాయ సంబంధించిన పనులకు గవర్నమెంట్ ఉద్యోగులకు
అనుమతి ఇస్తున్నట్లు తెలిపారు
దాతల సహాయంతో 2000మందికి బియ్యం మరియు 2000 నిత్యావసర సరుకులను
పంపిణీ చేయాలని నిర్ణయించామని అన్నారు ...
తెలంగాణ ప్రభుత్వం వలస కార్మికులపై ప్రత్యేక శ్రద్ద తీసుకున్నందున వారికి పూర్తిగా
ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తున్నామని అన్నారు..
మొయినాబాద్ మండలం లో లాక్ డౌన్ మరింత కట్టుదిట్టం చేసేందుకు 4 టీంలు
ఏర్పాటు చేసినట్లు అన్నారు..
ప్రతి రోజు సాయంత్రం ఎస్ఐలతో పాటు నలుగురు పోలీసులు ప్రతి గ్రామానికి వెళ్లి
లాక్ డౌన్ పై అవగాహన కల్పిస్తామని అన్నారు...
|