దేవాలయాల్లో పూజ చేస్తున్న పూజారులను ప్రభుత్వం ఆదుకోవాలి-సిఐటియు జిల్లా కార్యదర్శి వి.ప్రవీణ్ కుమార్

లాక్ డౌన్  నేపథ్యంలో దేవాలయాల్లో పనిచేస్తున్న పూజారులకు బతకడం కష్టంగా మారిందని వారిని ప్రభుత్వం తక్షణ సాహయంగా నెలకు ఐదు వేల రూపాయలు మూడు నెలలకు సరిపడా నిత్యవసర వస్తువులు సరఫరా చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి v. ప్రవీణ్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈరోజు సదాశివపేట పట్టణంలో పూజారులకు కు నిత్యవసర వస్తువులు కూరగాయలు పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లాక్ డౌన్  వల్ల అనేకమందికి ఉపాధి పోయిందన్నారు ముఖ్యంగా అసంఘటిత రంగ కార్మికులకు బతకడం చాలా కష్టంగా ఉందన్నారు గత ముప్పై మూడు రోజుల నుంచి లాక్ డౌన్ వలన దేవాలయాలకు భక్తులు రాకపోవడం వల్ల పూజార్ల పరిస్థితి దారుణంగా తయారైందన్నారు పూజారులకు ప్రత్యేకంగా ప్రభుత్వం సాయం చేయాలని మూడు నెలలకు సరిపడే సరుకులను సరఫరా చేయాలని ఆయన డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు సంతోష్ కుమార్ కృష్ణమూర్తి రాజు నర్సింలు తదితరులు పాల్గొన్నారు