లక్ష కరోనా ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లను తెప్పించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం


కరోనాను కట్టడి చేయడానికి ప్రభుత్వం కిట్లను దిగుమతి చేసింది. 
దక్షిణ కొరియా దేశం నుండి ఏపీ లక్ష కరోనా ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లను దిగుమతి చేసుకున్న సందర్భంగా జగన్ తన కార్యాలయం లో కిట్లను ప్రారంభించారు. ఈ కిట్ ను ఉపయోగించి కేవలం 10నిమిషాల్లోనే కరోనాను నిర్ధారించవచ్చు. ఈ కిట్లను ఉపయోగించి జిల్లాల్లో కరోనా ప్రభావిత ప్రాంతాల్లో పరీక్షలు చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కరోనా టెస్ట్ చేశయించుకున్నారు.   10 నిమిషాల తరవాత వచ్చిన రిపోర్ట్ లో సీఎం కు కరోనా నెగిటివ్ వచ్చింది. ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లను ఉపయోగించి త్వరలోనే కరోనా కు బ్రేక్ వేయొచ్చని ప్రభుత్వం భావిస్తోంది.