షావోమి ఎంఐ 10 లాంచ్టెక్నాలజీ :  ప్రముఖ మొబైల్ సంస్థ షావోమీ  చాలా రోజుల తరువాత  5జీ సపోర్టుతో ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ ను  శుక్రవారం లాంచ్ చేసింది. షావోమి ఎంఐ 10 పేరుతో ఈ మొబైల్ ను  భారత మార్కెట్లో తీసుకొచ్చింది. దీంతోపాటు  వైర్ లెస్ చార్జర్,  ధర రూ. 2299 గా ఉంచింది. దీన్ని ప్రీ ఆర్డర్ చేస్తే రూ.1999కే లభ్యం.  4కే ఎంఐ పవర్ బ్యాంకును   కూడా  తీసుకొచ్చింది. దీని ధర రూ. 3499 గా  వుండనుంది. మే  12 నుంచి ఎంఐ.కామ్, అమెజాన్ ద్వారా లభ్యం.
అలాగే  దేశంలో షావోమి తన వైర్ లెస్  ఇయర్ ఫోన్స్ ను లాంచ్ చేసింది. దీని లాంచింగ్ ధరను రూ. 3999గా  ఉంచింది. ఈ ఆఫర్ ముగిసిన తరువాత దీని ఎంఆర్ పీ ధర  రూ. 4499 గా ఉండనుంది.  మే 10 నుంచి ఎంఐ.కామ్, ఫ్లిప్ కార్ట్ ద్వారా లభ్యం.