తెలంగాణ లో లక్డౌన్ కొనసాగుతున్నతగ్గుముఖం పట్టని కరోనా కేసులు : మళ్ళీ కొత్తగా 11 కేసులు నమోదు


తెలంగాణ : దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ రోజు రోజు అధికంగా వ్యాప్తి చెందుతుంది . కరోనా కట్టడికి కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించిన కరోనా కేసులు బయట పడటం ఆగట్లే , ఈ నేపథ్యంలోరాష్ట్రంలో బుధవారం 11 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 20 మంది డిశ్చార్జి అయ్యారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,107కు చేరుకుంది. ఇప్పటివరకు 648 మంది కోలుకొని డిశ్చార్జి అయినట్లు ప్రజారోగ్య డైరెక్టర్‌ డాక్టర్‌ శ్రీనివాసరావు వెల్లడించారు. ఈ మేరకు ఆయన బులెటిన్‌ విడుదల చేశారు. తాజాగా నమోదైన 11 కేసులన్నీ జీహెచ్‌ఎంసీ పరిధిలోనివే కావడం గమనార్హం. కాగా, ప్రస్తుతం కరోనా బారిన పడి 430 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు 29 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఇక బుధవారం డిశ్చార్జి అయిన వారిలో హైదరాబాద్‌కు చెందిన వారు 10 మంది ఉన్నారు. సూర్యాపేట, ఆదిలాబాద్, గద్వాల జిల్లాలకు చెందిన వారు ఇద్దరు చొప్పున ఉన్నారు. వికారాబాద్, ఖమ్మం, మేడ్చల్, నిర్మల్‌ జిల్లాలకు చెందినవారు ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు.