ఈ యేడు ఖైరతాబాద్‌ మహా గణపతి.. 11 అడుగుల్లోపే

 ఈ యేడు ఖైరతాబాద్‌ మహా గణపతి.. 11 అడుగుల్లోపే ఎత్తుతో మట్టి ప్రతిమగా సాక్షాత్కరించనున్నాడు. కరోనా వైరస్‌ కారణంగా ఈసారి 11 అడుగుల్లోపు ఎత్తులోనే రూపొందించాలని మంగళవారం నిర్వాహకులు నిర్ణయించారు. వాస్తవానికి ఈ యేడు 66 అడుగుల ఎత్తు, 18 తలలతో విశ్వరూప మహాగణపతిని నిర్మించేందుకు ఈ నెల 18 తొలి ఏకాదశి రోజున కర్రపూజ నిర్వహిం చాలని భావించారు. అయితే అధికారులు, నిర్వాహకులు ప్రస్తుత కరోనా పరిస్థితి, భౌతిక దూరం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని 11 అడుగులలోపు మట్టి గణపతిని రూపొందించాలన్న నిర్ణయానికి వచ్చారు.