గోషామహల్ జీహెచ్ఎంసీ 14వ జోన్ పరిధిలో బుధవారం ఒకే ఇంట్లో 8 మందికి కరోనా


తెలంగాణ : రాష్ట్రంలో ప్రతి రోజు కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. రెండంకెల సంఖ్యలో పాజిటివ్ కేసులు రికార్డవుతున్నాయి. GHMC పరిధిలో వైరస్ కట్టడికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నా..కేసులు మాత్రం నమోదవుతున్నాయి. తాజాగా 2020, మే 20వ తేదీ బుధవారం కొత్తగా 27 కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 15 మంది, 12 మంది వలసదారులు వైరస్ బారిన పడ్డారు. .గోషామహల్ జీహెచ్ఎంసీ 14వ జోన్ పరిధిలో బుధవారం ఒకే ఇంట్లో 8 మందికి కరోనా నిర్ధారణ కావడం కలకలం రేపింది. స్థానిక నట్రాజ్ నగర్ లో ఉంటున్న ఓ వ్యాపారి (34) ఐదు రోజుల క్రితం కరోనా పాజిటివ్ గా వచ్చింది. దీంతో ఆయన కుటుంబసభ్యులకు పరీక్షలు చేయగా..తండ్రి, తల్లి, భార్య, కుమారుడు, తమ్ముడు, తమ్ముడి భార్య, ఇద్దరు చెల్లెళ్లకు కరోనా సోకిందని తేలింది. కరోనా వైరస్ ఎప్పుడు తగ్గుముఖం పడుతుందోనని ప్రజలు ఎదురు చూస్తున్నారు. ( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )