ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం 21 మంది వలస కూలీలు మృతి

ఉత్తరప్రదేశ్‌లో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వలస కూలీల ట్రక్కును మరో ట్రక్కు ఢీకొన్నది. ఈ ప్రమాదంలో 21 మంది వలస కూలీలు మృతి చెందగా, పలువురికి గాయాలు అయ్యాయి. ఈ ఘటన ఔరాయ జాతీయ రహదారిపై జరిగింది. వలవ కూలీల ట్రక్కు రాజస్థాన్ నుంచి యూపీ వస్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. పోలీసులు గాయపడిన వారిని ఆస్పత్రికి తరలిస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.