కరోనా.. 24 గంటల్లో 132 మంది మృతి

దేశంలో కరోనా విజృంభిస్తోంది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 5,609 కరోనా కేసులు నమోదు కాగా, 132 మంది మృతిచెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,12,359కి చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ గురువారం ఉదయం హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న 45,229 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి కాగా, 3,435 మంది మృతిచెందారు. ప్రస్తుతం దేశంలో 63,624 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.
దేశంలో నమోదైన కేసుల్లో 30 శాతానికి పైగా కేవలం మహారాష్ట్రలోనే ఉన్నాయి. అక్కడ మొత్తం 39,297 కరోనా కేసులు నమోదు కాగా, 10,318 మంది కోలుకున్నారు. 1,390 మంది మృతిచెందారు. మహారాష్ట్ర తర్వాత తమిళనాడు(13,191), గుజరాత్‌(12,537), ఢిల్లీ(11,088)లలో కేసులు అధికంగా ఉన్నాయి.