దేశవ్యాప్త కరోనా వివరాలు : మహారాష్ట్ర ఒక్క రాష్ట్రంలోనే 10 వేల కరోనా కేసులు


భారత్‌లో కరోనా విజృంభణ ఆగడం లేదు. రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో  కొత్తగా 1,993  కరోనా కేసులు నమోదయ్యాయి. భారత్‌లో ఒక రోజు వ్యవధిలో నమోదైన కరోనా కేసుల్లో ఇదే అధికం. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 35,043కి చేరింది.  ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ శుక్రవారం ఉదయం కీలక నిర్ణయం తీసుకుంది.ఇప్పటివరకు 8,889 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి కాగా, 1147 మంది మృతిచెందారు. ప్రస్తుతం దేశంలో 25,007 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.  మహారాష్ట్రలో అత్యధికంగా 10,498 కరోనా కేసులు నమోదు కాగా, 459 మంది మృతిచెందారు. ఆ తర్వాత గుజరాత్‌లో 4,395, ఢిల్లీలో 3,515, మధ్యప్రదేశ్‌లో 2,660, రాజస్తాన్‌లో 2,584, తమిళనాడులో 2,323, ఉత్తరప్రదేశ్‌లో 2,203 కరోనా కేసులు నమోదయ్యాయి.