తెలంగాణాలో రానున్న 24 గంటలలో వర్షాలు కురిసే అవకాశం : వెల్లడించిన వాతావరణ శాఖ అధికారులు


తెలంగాణ : అండమాన్‌ సముద్రంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, దాని ప్రభావంతో ఆగ్నేయ బంగాళాఖా తం, అండమాన్‌ సముద్రంలో ఈ నెల 13వ తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు హైదరాబా ద్‌ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. మధ్యప్రదేశ్‌ నుంచి తమిళనాడు వరకు 0.9 కి.మీ ఎత్తులో ఉపరితల ద్రోణి కొనసాగుతున్నట్లు తెలిపారు. కాగా ఆది, సోమవారాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, వడగండ్లు, ఈదురు గాలులతో (గంటకు 30-40 కి.మీ) పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.  ( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )