తెలంగాణలో ఒక్క రోజే 31 కేసులు నమోదు : భయాందోళనలో హైదరాబాద్ వాసులు


తెలంగాణ: దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ రోజు రోజు అధికంగా వ్యాప్తి చెందుతుంది . కరోనా కట్టడికి కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించిన కరోనా కేసులు బయట పడటం ఆగట్లే , ఈ నేపథ్యంలో రాష్ట్రంలో శనివారం కరోనా వైరస్ పాజిటివ్ కేసులు సంఖ్య పెరిగింది. నిన్న 10 కేసులు నమోదు కాగా.. మరునాడు 31 కేసులు నమోదయ్యాయి. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య 1163కి చేరింది. వైరస్ సోకి శనివారం ఒకరు చనిపోయారు. దీంతో మృతుల సంఖ్య 30కి చేరింది. వైరస్ కోలుకోని 24 మంది డిశ్చార్జ్ అయ్యారని వైద్యారోగ్యశాఖ అధికారులు తెలిపారు. ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 751కి చేరింది. ప్రస్తుతం 382 మందికి ఆస్పత్రుల్లో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 9 జిల్లాలు గ్రీన్ జోన్లు పరిధిలో ఉన్నాయని.. మరో 14 జిల్లాలు కూడా ఆరంజ్ జోన్ నుంచి గ్రీన్ జోన్‌లోకి వెళ్లనున్నాయి. దీనికి సంబంధించి కేంద్రానికి నివేదిక అందజేశామని.. సోమవారం ప్రకటన వెలువడే అవకాశం ఉందని చెప్పారు. సూర్యాపేట, వరంగల్ అర్బన్, నిజామాబాద్ జిల్లాలను ఆరంజ్ జోన్లలో చేర్చాలని కేంద్ర వైద్యారోగ్యశాఖను కోరామని.. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మూడు జిల్లాలు మాత్రమే రెడ్ జోన్లుగా ఉంటాయని మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ఈ నెల 15వ తేదీన సీఎం కేసీఆర్ రివ్యూ నిర్వహిస్తానని కూడా ఇదివరకు తెలియజేశారు. కేసుల తీవ్రతను బట్టి.. హైదరాబాద్‌లో షాపులను ఓపెన్ చేసే అంశంపై నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. ఢిల్లీ, చెన్నైలో పరిస్థితిని అంచనా వేసి డిసిషన్ తీసుకుంటామని కేసీఆర్ స్పష్టంచేశారు. 

 ( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )