ఆంధ్రప్రదేశ్ లో విజృంభిస్తున్న కరోనా : 33 మంది కరోనాతో మృతి, కొత్తగా 67 కేసులు నమోదు


ఆంధ్రప్రదేశ్ : దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ రోజు రోజు అధికంగా వ్యాప్తి చెందుతుంది . కరోనా కట్టడికి కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించిన కరోనా కేసులు బయట పడటం ఆగట్లే , ఈ నేపథ్యంలో కొత్తగా ఆంధ్రప్రదేశ్ లో 67 కేసులు నమోదు అయినట్టు రాష్ర్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తన బులిటెన్ లో వెల్లడించింది. ఈ కొత్త కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా కేసులు 1650 కి చేరుకున్నాయని ప్రకటించింది. యాక్టీవ్ కేసులు 1093 ఉన్నాయని, ఇప్పటివరకు 524 మంది డిశ్చార్జ్ అయినట్టు స్పష్టం చేశారు. అటు ఇప్పటి వరకు 33 మంది కరోనాతో మృతి చెందినట్టు పేర్కొంది. మరో వైపు కరోనా కేసులు పెరుగుతున్న నేటి నుంచి మద్యం అమ్మకాలు చేపట్టడంతో జనాలు బారులు తీరుతున్నారు. జిల్లాల వారీగా కొత్తగా నమోదైన కేసుల వివరాలు చూస్తే చిత్తూరులో 1, గుంటూరులో 19, కడప 4, కృష్ణ 12, కర్నూలులో 25, విశాఖపట్నంలో 6, కొత్త కేసులు నమోదు అయ్యాయి. మరోసారి కర్నూలు జిల్లాలోనే కొత్తగా నమోదైన కేసుల సంఖ్య ఎక్కువగా ఉంది. అత్యధికంగా అక్కడే ఆదివారం 25 కేసులు నమోదయ్యాయి. కర్నూలు జిల్లాలో కేసుల సంఖ్య 491 దాటగా, గుంటూరులో 338 చేరుకున్నాయి. విజయనగరం జిల్లాలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు.