దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసులు 40 వేలు దాటినా వేల లక్డౌన్ ఆంక్షలు సడలింపు

10
జాతీయం : దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ రోజు రోజు అధికంగా వ్యాప్తి చెందుతుంది . కరోనా కట్టడికి కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించిన కరోనా కేసులు బయట పడటం ఆగట్లే , ఈ నేపథ్యంలో భారత్‌లో కరోనా మహమ్మారితో జనం ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. కరోనా పాజిటివ్‌ కేసులు 40 వేలు దాటాయి. తాజాగా రికార్డు స్థాయిలో ఒక్కరోజులో 83 మంది కరోనా వల్ల తుదిశ్వాస విడిచారు. శనివారం సాయంత్రం నుంచి ఆదివారం సాయంత్రం వరకు.. 24 గంటల వ్యవధిలో ఈ మరణాలు చోటుచేసుకున్నాయి. అలాగే కొత్తగా 2,487 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు ఒక్కరోజులో నమోదైన కేసుల్లో ఇదే అత్యధికం కావడం గమనార్హం. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1,306కు, పాజిటివ్‌ కేసుల సంఖ్య 40,263కు చేరిందని కేంద్రం ఆదివారం ప్రకటించింది. దేశంలో యాక్టివ్‌ కరోనా కేసులు 28,070. ఇప్పటివరకు 10,886 మంది బాధితులు చికిత్సతో కోలుకొని, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు.