తెలంగాణ లో రానున్న 48 గంటలలో మోస్తరు నుండి భారీగా వర్షాలు పడే అవకాశం


తెలంగాణ : రాష్ట్రంలో మంగళ, బుధ వారాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో అక్కడక్కడ వడగాలులు కూడా వీచే అవకాశం ఉన్నట్లు చెప్పారు. దక్షిణ అండమాన్‌ సముద్రం, దానిని ఆనుకొని ఉన్న ఆగ్నేయ బంగాళా ఖాతంలో అల్పపీడనం కొనసాగుతున్నట్లు తెలిపారు.