తెలంగాణ లో తగ్గిన కరోన కేసులు : నిన్న 6 కరోనా పాజిటివ్‌ కేసులు మాత్రమే నమోదు

8
తెలంగాణ : రాష్ట్రం లో శుక్రవారం కొత్తగా 6 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తెలియచేసారు . ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,044కు చేరుకుందని ఆయన పేర్కొన్నారు. కరోనా నుంచి కోలుకుని ఇవాళ 22 మంది డిశ్చార్జ్‌ అయ్యారని తెలిపారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 464 మంది డిశ్చార్జ్‌ కాగా, 28 మంది కరోనా బారినపడి మరణించారని పేర్కొన్నారు. తెలంగాణలో ప్రస్తుతం 552 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయన్నారు.ఢిల్లీలో మర్కజ్‌ ప్రార్థనలకు అనుమతి ఇచ్చింది కేంద్ర ప్రభుత్వమేనని.. 90 శాతం కేసులు మర్కజ్‌ కేసులేనని మంత్రి తెలిపారు. 22 మందికి ఎలా కరోనా వచ్చిందో ట్రేస్‌ చేస్తున్నామని పేర్కొన్నారు. లక్ష మందికి వైద్యం చేయడానికి సిద్ధంగా ఉన్నామని మంత్రి ఈటల రాజేందర్‌ స్పష్టం చేశారు.