ఆంధ్రప్రదేశ్‌-తెలంగాణ బోర్డర్‌‌ వద్ద భారీగా ట్రాఫిక్‌ జామ్‌

ఆంధ్రప్రదేశ్‌-తెలంగాణ బోర్డర్‌‌ వద్ద భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయింది. ఏపీ నుంచి వెళ్లే వాహనాలను తెలంగాణ అధికారులు, తెలంగాణ నుంచి ఏపీకి వచ్చే వాహనాలను ఏపీ అధికారులు అడ్డుకున్నారు. దీంతో  గరికపాడు చెక్‌పోస్టు  వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి. దీంతో అక్కడ విధులు నిర్వరిస్తున్న సిబ్బంది.. ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులతో చర్చించారు. ఈ క్రమంలో కలెక్టర్ల జోక్యంతో సమస్య పరిష్కారమైంది. దీంతో ఇరువైపుల సరైన పత్రాలు కలిగిన వాహనాల ప్రయాణానికి అనుమతించారు. మరోవైపు వలస కూలీలు ప్రయాణిస్తున్న నాలుగు బస్సులను మాత్రం పునరావాసానికి తరలించారు. వారి ప్రయాణానికి అనుమతి వచ్చాక పంపుతామని చెక్‌పోస్ట్‌ సిబ్బంది తెలిపారు.