పోలీసులపై దాడి చేసిన వలస కార్మికులు : గాయాలపాలైన పోలీసులు


జాతీయం : కేరళలో వలసకార్మికులు, పోలీసులకు మధ్య ఘర్షణ వాతావరణ నెలకొంది.  700 మంది వలస కార్మికులు తమను సొంతూళ్లకు పంపించేందుకు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అయితే పోలీసులు వలస కార్మికులన ఆందోళన విరమించేలా నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. కార్మికులు ఒక్కసారిగా పోలీసులపైకి రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులకు గాయాలయ్యాయి. ఇద్దరినీ చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
 ( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )