ఒడిశా వలస కూలీలకు శుభవార్త తెలియచేసిన ఏపీ సీఎం జగన్


ఆంధ్రప్రదేశ్ :  రాష్ట్రంలో ఒడిశాకు చెందిన వలస కూలీలు, కార్మికులకు కల్పిస్తున్న సౌకర్యాల పట్ల ఆ రాష్ట్ర  సీఎం నవీన్‌ పట్నాయక్, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ సంతృప్తి వ్యక్తం చేశారు. ఇరు రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన (ఇక్కడి వారు అక్కడ.. అక్కడి వారు ఇక్కడ) వలస కార్మికులను స్వస్థలాలకు తరలించే విషయమై శనివారం వారి మధ్య వీడియో కాన్ఫరెన్స్‌ జరిగింది. రాష్ట్రంలో ఒడిశా వలస కూలీలను బాగా చూసుకుంటుండటంపై వారు ముఖ్యమంత్రి కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వారి అభిప్రాయాలు ఇలా ఉన్నాయి.