కలిసి పని పనిచేయనున్న బద్ద శత్రువులు జొమాటో, స్విగ్గీ


బిజినెస్ : గోద్రేజ్ ఆగ్రేవెట్ లిమిటెడ్(GAVL) డెయిరీ, పౌల్ట్రీ, ఇతర ఫుడ్ ఉత్పత్తుల సరఫరా కోసం ఫుడ్ అగ్రిగేటర్లు జొమాటో, స్విగ్గీలతో ఒప్పందం కుదుర్చుకుంది. గోద్రేజ్ ఆగ్రేవేట్ తమ సేవలను విస్తరించేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా నిత్యావసర వస్తువులతో పాటు డైరీ ఉత్పత్తులను నిరంతరాయంగా సరఫరా చేయాలని నిర్ణయించింది. ఇందుకు ఈ ఫుడ్ డెలివరీ యాప్స్‌తో జత కట్టింది. కరోనా వైరస్ నేపథ్యంలో కస్టమర్లకు నిత్యావసరాలతోపాటు, డైరీ ఉత్పత్తులను అందించాలనే లక్ష్యంతో గోద్రెజ్ ఆగ్రోవేట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఇప్పటికే లాక్ డౌన్ ఆంక్షలు తగ్గిన నగరాల్లో సేవలు అందిస్తోంది. లాక్ డౌన్ అనంతరం ఇతర నగరాల్లో కూడా సేవలను అందించడానికి సిద్ధమైంది. గోద్రెజ్ ఆగ్రోవెట్ అనుబంధ గోద్రేజ్ జెర్సీ ఉత్పత్తుల్ని కూడా స్విగ్గీ , జొమాటో ద్వారా కస్టమర్లకు అందించనున్నాయి. ఈ ఒప్పందం కింద పాలు, నెయ్యి, పెరుగు, పన్నీర్, బట్టర్ మిల్క్ సరఫరా చేస్తారు. వీటిని ఇప్పటికే ఈ-కామర్స్ సైట్స్ బిగ్ బాస్కెట్, ఫ్లిప్‌కార్ట్‌లలో అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు హైదరాబాద్, చెన్నై, విశాఖపట్నం నగరాల్లో కూడా ఆంక్షలు ఎత్తివేసిన తర్వాత స్విగ్గీ, జొమాటో ద్వారా ఆర్డర్ చేయవచ్చు. ( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )