అమెజాన్ , ఫ్లిప్‌కార్ట్ తదితర కంపెనీలకు ఊరట ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం

జాతీయం :  కరోనా  వ్యాప్తి,  లాక్ డౌన్ లో తీవ్రంగా నష్టపోయిన  ఈ కామర్స్ దిగ్గజాలకు తాజాగా భారీ  ఊరట లభించనుంది. మే 4వ తేదీ నుంచి అమెజాన్,ఫ్లిప్‌కార్ట్  లాంటి  కంపెనీల  ఆన్ లైన్ వ్యాపారానికి  కొన్ని ఆంక్షలతో అనుమతి  లభించింది. నిత్యావసరేతర వస్తువులను డెలివరీ చేసేందుకు అనుమతినిచ్చింది.  రెడ్ జోన్లు మినహా తాజా మార్గదర్శకాలతో నాన్ ఎసెన్షియల్ వస్తువుల డెలివరీకి కూడా కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దేశ వ్యాప్తంగా ఇప్పటివరకూ ఈ అనుమతి నిత్యావసర వస్తువులను మాత్రమే పరిమితమైంది.
దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ మే 17 వరకు పొడిగించిన సందర్భంగా  తాజాగా మార్గదర్శకాలను కేంద్రం విడుదల చేసింది.  సంబంధిత నిబంధనలను పాటిస్తూ  గ్రీన్, ఆరెంజ్ జోన్లలో నివసించే వినియోగదారులకు మే 4 నుంచి నాన్ ఎసెన్షియల్ వస్తువులను డెలివరీ చేయవచ్చు.  ముఖ్యంగా స్మార్ట్ ఫోన్లు, ల్యాప్ టాప్స్ సహా ఇతర గాడ్జెట్లతో పాటు ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను విక్రయించుకోవచ్చు.  అయితే రెడ్ జోన్లలో మాత్రం కిరాణా సరుకులు, మందులు లాంటి నిత్యావసర వస్తువులకు మాత్రమే అనుమతి వుంది.