వలస కార్మికులకి గుడ్ న్యూస్ : వలస కార్మికులతో లింగంపల్లి నుంచి బయల్దేరిన తొలి రైలుహైదరాబాద్ :  లాక్ డౌన్ తో ఇరుక్కుపోయిన వలస కూలీలు, విద్యార్థులు, పర్యాటకులు ఊపిరి పీల్చు కుంటున్నారు. వారిని వారి స్వస్థలాలకు తరలింపు మొద లైంది. వారిని రైళ్ల ద్వారా తర లించాలని కేంద్రం నిర్ణయిం చింది. ఈ మేరకు రైల్వే బోర్డు అనుమతి ఇవ్వటంతో ఆ దిశగా చర్యలు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా 1,225 మంది వలస కూలీలతో కూడిన తొలి రైలు శుక్రవారం ఉదయం 4.50కి లింగంపల్లి రైల్వే స్టేషన్‌ నుంచి జార్ఖండ్‌లోని హతి యాకు బయల్దేరింది. సంగారెడ్డి జిల్లాలో పనిచేస్తున్న ఈ వలస కూలీలు లాక్‌డౌన్‌తో తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
చివరకు ఆందోళనకు దిగటం, అది కాస్తా ఉద్రిక్తతకు దారితీయటం, పోలీసు వాహనాలు ధ్వంసం కావటానికి దారితీసిన సంగతి తెలిసిందే. వారిని స్వస్థలాలకు పంపేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టి విషయాన్ని కేంద్రం దృష్టికి తీసు కెళ్లటంతో రైలు ద్వారా తరలింపునకు అంగీకరిం చింది. సీఎస్‌ సోమేశ్‌కుమార్, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్‌ కుమార్, ఈ తరలింపు వ్యవహా రాన్ని పర్యవేక్షించే నోడల్‌ అధి కారి సుల్తానియా తదితరులు అర్ధరాత్రి వరకు పర్యవేక్షించి ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇలా వేరే ప్రాంతాలకు చెంది లాక్‌ డౌన్‌ వల్ల మరో చోట ఇరుక్కు పోయిన వారందరినీ రైళ్ల ద్వారా తరలించాలని కేంద్రం నిర్ణయించింది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఎక్కడి రైళ్లు అక్కడే నిలిచిపోగా ఆ తర్వాత పట్టాలెక్కిన తొలి రైలు ఇదే.