నేటి ప్రధాన వార్తలు

ఆంధ్రప్రదేశ్‌:
నేడు వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాల ప్రారంభం
తాడేపల్లి సీఎం కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా
రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించనున్న సీఎం జగన్
రాష్ట్రవ్యాప్తంగా 10,641 రైతు భరోసా కేంద్రాలు
వీటి నుంచి రైతులకు అన్ని వ్యవసాయ సేవలు
రైతులను స్నేహితులుగా నడిపించనున్న రైతు భరోసా కేంద్రాలు
నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులను సర్టిఫై చేసి..
ప్రభుత్వమే గ్యారెంటీ ఇచ్చి విక్రయం
రైతులకు శిక్షణా తరగతులు, విజ్ఞాన కేంద్రాలుగా రైతుభరోసా కేంద్రాలు
తెలంగాణ:
గ్రేటర్‌ హైదరాబాద్‌లో కరోనా కేసులపై ఐసిఎంఆర్ సర్వే
నేటి నుంచి సర్వే నిర్వహించనున్న ఐసిఎంఆర్
హైదరాబాద్‌లో ఐదు కంటైన్మెంట్‌ జోన్లలో రెండురోజులపాటు సర్వే
ఆదిభట్ల, బాలాపూర్‌, మియాపూర్‌, చందానగర్‌, టప్పాచబుత్ర ప్రాంతాల్లో 10 ప్రత్యేక బృందాలతో సర్వే