బీజేపీ జిల్లా అధ్యక్షుల నియామకం

తెలంగాణ వ్యాప్తంగా పార్టీని బలోపేతం చేసేందకు బీజేపీ వ్యూహాలు సిద్ధం చేస్తోంది. అందులో భాగంగానే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ కొత్త టీమ్‌ తయారీలో నిమగ్నమయ్యారు. తాజాగా ఏడు జిల్లాలకు కొత్త అధ్యుక్షులను నియమించారు. అయితే బీజేపీ హైదరాబాద్‌ జిల్లా అధ్యక్షుడిగా మాత్రం గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అనుచరుడు రావుల శ్రీధర్ రెడ్డి మధ్య భారీస్థాయిలో పోటీ నెలకొని ఉండటంతో ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. జిల్లాల వారీగా కొత్తగా నియమితులైన అధ్యక్షుల వివరాలు..
రాజన్న సిరిసిల్ల జిల్లా - ప్రతాప్ రామకృష్ణ 
మెదక్ జిల్లా - గడ్డం శ్రీనివాస్
సిద్దిపేట జిల్లా - దూది శ్రీకాంత్ రెడ్డి
మహబూబ్ నగర్ జిల్లా - ఎర్ర శేఖర్ (మాజీ శాసనసభ్యులు)
వనపర్తి జిల్లా - డాక్టర్ అద్దుల్ రాజ వర్ధన్ రెడ్డి 
మహబూబాబాద్ జిల్లా - పెద్దిరాజు రామచందర్ రావు
ములుగు జిల్లా - చింతలపూడి  భాస్కర్ రెడ్డి