జియగూడాలో బ్యాంక్‌లో కరోనా కలకలం

తెలంగాణాలో కరోనా కేసులు సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌ నగరంలో అధిక సంఖ్యలో కరోనా ‌ కేసులు నమోదు అవుతున్నాయి. తాజాగా ఈ మహమ్మారి హైదరాబాద్‌ బ్యాంకులను తాకింది. ఇటీవలే డబ్బుల కోసం జియాజిగూడలోని ఓ బ్యాంక్‌కు వచ్చిన ఓ మహిళకు కరోనావైరస్‌ సోకింది. బాధితురాలికి కరోనా సోకడంతో బ్యాంకు సిబ్బంది మొత్తాన్ని క్వారంటైన్‌కు తరలించారు. బాధిత మహిళ కంటైన్మెంట్ జోన్ నుంచి బ్యాంకుకు వచ్చినట్టుగా అధికారులు నిర్ధారించారు.