రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్రం, జిల్లా, మండల స్థాయిలో ఏర్పాటు : ఎపి సిఎం జగన్


ఆంధ్ర ప్రదేశ్ :  రైతుల సంక్షేమం కోసం మార్కెట్‌ పరిస్థితులను విశ్లేషించి, ఏ పంటలకు ఎంత డిమాండ్‌ ఉంటుందన్న ముందస్తు అంచనాతో వారికి సూచనలు, సలహాలు ఇవ్వడానికి రాష్ట్రం, జిల్లా, మండల స్థాయిలో వ్యవసాయ సలహా మండళ్లను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి  అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. జాతీయ, అంతర్జాతీయ, స్థానిక మార్కెట్ల స్థితిగతులను పరిశీలించి, భవిష్యత్‌ డిమాండ్‌ అంచనాను శాస్త్రీయంగా విశ్లేషించి.. నమ్మకమైన సలహాలను అందిస్తే రైతులకు మేలు జరుగుతుందన్నారు. తద్వారా ఏ పంటలు ఎంత మేర సాగు చేయాలని రైతులే నిర్ణయించుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పారు. వ్యవసాయ అనుబంధ రంగాల ఉత్పత్తులు, మార్కెటింగ్, ధరలపై శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ధ్యానం సేకరణ అన్ని జిల్లాల్లో చురుగ్గా సాగుతోందని అధికారులు వివరించారు. ఇదే సమయంలో కృష్ణా జిల్లాల్లో బస్తాకు కొంత ధాన్యం మినహాయించుకుంటున్నారని రైతుల నుంచి వచ్చిన ఫిర్యాదులపై చర్చించారు. సమీక్షలో ముఖ్యమంత్రి ఆదేశాలు, సూచనలు ఇలా ఉన్నాయి.

అందరం ఉన్నా ఇలా జరిగిందా..
► బస్తాకు కొంత ధాన్యం మినహాయిస్తున్నారని కృష్ణా జిల్లా రైతుల నుంచి వచ్చిన ఫిర్యాదు లపై సీఎం తీవ్రంగా స్పందించారు. ఈ విధంగా ఎలా మినహా యిస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 
► ముఖ్యమంత్రి, చీఫ్‌ సెక్రటరీ, సెక్రటరీ, డీజీపీ లాంటి వ్యక్తులంతా ఇదే కృష్ణా జిల్లాలో ఉన్నా సరే.. ఇలాంటి ఘటనలు చోటు చేసు కోవడం సరికాదన్నారు. ఇలాంటి వాటిని చూస్తూ ఊరుకునే పరిస్థితి వద్దన్నారు.
► వెంటనే సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రైతులకు  అన్యాయం జరిగితే చూస్తూ ఊరు కోవద్దని, అన్యాయం చేసే వారిని ఉపేక్షిం చరాదని సీఎం జగన్‌ స్పష్టం చేశారు.  

ఫలితాలు రావాల్సిందే
► పంటలను రోడ్డు మీద వేసిన ఘటనలు గత ప్రభుత్వ హయాంలో రోజూ కనిపించేవి. అలాంటి ఘటనలు ఈ ప్రభుత్వ హయాంలో కనిపించడానికి వీల్లేదు. 
► చీనీ, అరటి, టమాటా, మామిడి ప్రాసెసింగ్‌ ప్లాంట్లపై దృష్టి పెట్టాలి. వచ్చే ఏడాది.. మళ్లీ ఈ పంటల మార్కెటింగ్‌లో సమస్యలు రాకూడదు.
► సమీక్షలో సీఎస్‌ సాహ్ని, మంత్రి కన్న బాబు, డీజీపీ గౌతం సవాంగ్, వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి పాల్గొన్నారు.

ధర ముందుగానే ప్రకటించాలి
► వ్యవసాయ సలహా మండళ్లు రాష్ట్రం, జిల్లా, మండలం స్థాయిలో ఏర్పాటు కావాలి. ఈ మేరకు వెంటనే కార్యాచరణ రూపొందించాలి.
► రాష్ట్ర స్థాయి అగ్రికల్చర్‌ అడ్వైజరీ బోర్డులు జిల్లా స్థాయి బోర్డులకు.. అక్కడి నుంచి మండల స్థాయి అడ్వైజరీ బోర్డులకు ఏయే పంటలు, ఎక్కడ వేయాలన్న దానిపై రైతులకు సూచనలు చేయాలి.
► పంటలు వేసేటప్పుడే ధర ప్రకటించి, ఆ రైతుకు ఆ ధర దక్కేలా చూడాలి. దీనివల్ల రైతుల్లో విశ్వాసం కలుగుతుంది. 
► పంటలను ఇ– క్రాపింగ్‌ చేయడం, రైతు భరోసా కేంద్రాలను వినియోగించి వాటిని కొను గోలు చేయడం.. ఈ ప్రక్రియలన్నీ.. వ్యవస్థీకృ తంగా సాగిపోయేలా చర్యలు తీసుకోవాలి.