కంప్లీట్ ప్యాకేజీతో కోర్సులకు నిలయంగా వర్సిటీ

విద్యా వ్యవస్థ రోజురోజుకీ కొత్త సాంకేతికత సంతరించుకుంటోంది. పాఠశాల స్థాయి నుంచే టెక్నాలజీ పరంగా మార్పులెన్నో చోటు చేసుకుంటున్నాయి. ప్రాథమిక, మాధ్యమిక పాఠశాలలు ఆధునిక బాటలో పయనిస్తున్నాయి. ఉన్నత విద్యకు సంబంధించి యూనివర్సిటీలు మాత్రం ఆధునికత, సాంకేతికను అందిపుచ్చుకోవడంలో ముందంజ వేయడం లేదు. ఒకవైపు అగ్రశ్రేణి ప్రభుత్వ యూనివర్సిటీలు మౌలిక సదుపాయాల కల్పన కోసమే ప్రయత్నిస్తుంటే మరోవైపు ప్రైవేటు వర్సిటీలు నాణ్యమైన విద్య, సహజ అభ్యాసన పద్ధతులు, పరిశ్రమ శిక్షణతో పాటు మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌ వంటి భారీ సంస్థలకు ఎంపికయ్యేలా కంప్లీట్‌ ప్యాకేజీని అందిస్తున్నాయి.

పూర్తి‌ ప్యాకేజీని అందిస్తున్న విద్యా సంస్థల్లో    లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (ఎల్‌పీయూ)  ముందుంది. 2005లో స్థాపించిన నాటి నుంచి నాణ్యమైన విద్యను అందిస్తూ ఎదిగింది. భారతదేశంలో అతిపెద్ద సింగిల్‌ క్యాంపస్‌ యూనివర్సిటీగా పేరు పొందింది. అతి తక్కువ వ్యవధిలోనే ఉన్నత విద్యలో నూతన ప్రమాణాలు నెలకొల్పింది. తిరుగులేని ప్లేస్‌మెంట్‌ రికార్డులు ఇప్పటికే దీనిని నిరూపించాయి. ఏటా లవ్లీ యూనివర్సిటీ విద్యార్థులను బహుళ జాతి సంస్థలు (ఎంఎన్‌సీ) ఎంపిక చేసుకుంటున్నాయి. అమెజాన్‌, శాప్‌, సిస్కో, మైక్రోసాఫ్ట్‌, ఇన్ఫోసిస్‌, బాష్‌, డెల్‌ సహా మరెన్నో కంపెనీలు పేస్ల్‌మెంట్‌ డ్రైవ్‌లు నిర్వహిస్తున్నాయి.