టాలీవుడ్ లో నే ట్రేండింగ్ కాంబినేషన్ : ఒక్క సారి లుక్కేయండి

 

సినిమాలు : మహేశ్ బాబు ఒక వైపున హీరోగా వరుస సినిమాలు చేస్తూనే .. మరో వైపున నిర్మాతగాను వ్యవహరిస్తున్నాడు. తన సినిమాలకు మాత్రమే నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించే మహేశ్ బాబు, ఈ మధ్యనే రూట్ మార్చాడు. ఓ మాదిరి బడ్జెట్ లో ఇతర హీరోల సినిమాలకి కూడా నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. అలా ప్రస్తుతం ఆయన అడివి శేష్ హీరోగా 'మేజర్' సినిమాను నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణ జరుపుకుంది. ఇక ఆ తరువాత సినిమాను ఆయన విజయ్ దేవరకొండ హీరోగా నిర్మించనున్నట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన చర్చలు కూడా పూర్తయ్యాయని అంటున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్టును గురించిన వివరాలను వెల్లడి చేయనున్నారని చెబుతున్నారు. ఆ వెంటనే కార్తీ హీరోగా ఒక సినిమాను నిర్మించడానికి మహేశ్ బాబు సన్నాహాలు చేయిస్తున్నాడని అంటున్నారు. తెలుగుతో పాటు తమిళంలోను ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో ఆయన వున్నాడని చెబుతున్నారు. ఇటు హీరోగానే కాదు .. అటు నిర్మాతగా కూడా మహేశ్ బాబు తన దూకుడు పెంచుతున్నాడన్న మాట.  రామ్ చరణ్ కూడా ఈ సినిమాకి నిర్మాతగా ఉండే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది .

 ( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )