గాంధీ ఆసుపత్రిపై పూల వర్షం


జాతీయం :  దేశవ్యాప్తంగా కరోనా కట్టడిపై పోరాటం చేస్తున్న కరోనా యోధులకు గౌరవ వందనంకు సంఘీభావం ప్రకటిస్తూ వారిపై పూలవాన కురిపించాలని త్రివిధ దళాధిపతి జనరల్‌ బిపిన్‌రావత్‌ పిలుపు మేరకు ఆదివారం దేశవ్యాప్తంగా కోవిడ్‌ ఆసుపత్రులపై వాయుసేన పూలవర్షం కురింపించారు. వైద్యులు, పారామెడికల్‌, పోలీసు, పారిశుద్ధ్య కార్మికులకు సంఘీభావంగా సాయుధ దళాలు ఈ కార్యక్రమాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. ఢిల్లీ పోలీస్‌ స్మారక చిహ్నం వద్ద పుష్పాంజలి సమర్పించి వందన సమర్పరణతో కార్యక్రమాలు ప్రారంభం అయ్యాయి. పోలీసు సేవలకు ప్రశంసగా ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన చాపర్‌ పోలీస్‌ వార్‌ మెమోరియల్‌పై పూలవర్షం కురింపించింది. ఢిల్లీ సహా వివిధ రాష్ట్రాల్లో ఉన్న పట్టణాల్లో కోవిడ్‌ ఆసుపత్రులపై వాయుసేన పూలవర్షం కురిపిస్తున్నారు.