దేశవ్యాప్తంగా కలకలం : కరోనా రోగి ఆత్మహత్య


జాతీయం : దేశంలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. కరోనా వైరస్ కారణంగా దేశమంతటా భయాందోళనకర వాతావరణం నెలకొంది. తాజాగా కరోనా వైరస్ రోగి ఒకరు మహారాష్ట్రలోని ఆసుపత్రిలో ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన ముంబైలో వెలుగుచూసింది. మరోల్‌లోని ఒక ఆసుపత్రిలో 60 ఏళ్ల కోవిడ్ -19 పాజిటివ్ రోగి ఆత్మహత్య చేసుకున్నారు. మృతుడు తన పైజామా సాయంతో ఆసుపత్రి 9 వ అంతస్తులో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. మృతుడు ముంబైలోని విఖ్రోలి ప్రాంతానికి చెందినవాడు. అతనికి కరోనా సోకినట్లు నిర్థారణ కావడంతో ఆసుపత్రిలో చేర్పించారు. ఇదిలావుండగా మహారాష్ట్రలో కరోనా వైరస్ రోగుల సంఖ్య నిరంతరం పెరుగుతోంది. ఇప్పటివరకు 20228 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. 779 కరోనా వైరస్ రోగులు మృతి చెందారు. 3800 కరోనా వైరస్ రోగులు కోలుకున్నారు. కరోనా వైరస్ ప్రభావం ముంబైలో అధికంగా కనిపిస్తోంది. ముంబైలో ఇప్పటివరకు 12864 మంది కరోనా వైరస్ బారినపడగా, ఇప్పటివరకు 489 మంది మృతి చెందారు. 
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )