సల్మాన్‌ ఖాన్ ప్రియురాలి లులియా వంతూర్‌ వివాహ విషయంపై ఇంటర్య్వూ

బాలీవుడ్‌ కండవీరుడు   సల్మాన్‌ ఖాన్ ప్రియురాలిగా ప్రచారంలో ఉన్న లులియా వంతూర్‌ తన వివాహ విషయంపై స్పందించారు. ఇటీవల ఓ ఇంటర్య్వూలో సూపర్‌ స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌, మీరు త్వరలో పెళ్లి చేసుకునే ఆలోచనలో ఉన్నారా అని అడగ్గా.. ఒక్కసారిగా పెద్దగా నవ్వి ఈ విషయాన్ని దాటేశారు. ఆ తర్వాత ‘వివాహం మాత్రమే  కాకుండా మరో ముఖ్యమైన విషయం ఏంటంటే  మనుషులు ఒకరిపై ఒకరికి ఎలాంటి భావనలు కలిగి ఉంటారు. వారు ఎంతకాలం కలిసి గడుపుతారన్న విషయం ముఖ్యమైనది. అందువల్ల కొన్ని సంబంధాలకు కొంత సమయం ఇవ్వాలన్నది నా అభిప్రాయం’ అని చెప్పుకొచ్చారు. అంతేగాక ఈ మధ్య ఆమె తల్లిదండ్రులు తనని ఎప్పుడు పెళ్లి చేసుకుంటావని పదే పదే అడగడం ప్రారంభించారని కూడా చెప్పారు. ‘వారు అడిగిన మరుసటి రోజే నేను పెళి చేసుకోవచ్చు. కానీ ఆ పెళ్లి నాకు సంతోషాన్ని ఇవ్వలేదు. ఒకవేళ ఈ సమాధానం నా తల్లిదండ్రులు వింటే వారు ఇక దీనిపై నన్ను ప్రశ్నించరనే అభిప్రాయపడుతున్నాను’ అని తెలిపారు. కాగా లులియా వంతూర్‌, సల్మాన్‌ ఖాన్‌లు కొంతకాలంగా పన్వెల్‌లోని తమ ఫామ్‌హౌజ్‌లో సహజీవనం చేస్తున్నారని, త్వరలోనే భాయిజాన్‌, లులియాను పెళ్లి చేసుకుబోతున్నాడనే వార్తలు కూడా వచ్చాయి. అయితే ఇప్పటీ వరకు భాయిజాన్‌ ఈ విషయంపై స్పష్టతను ఇవ్వలేదు.  ఇక తన పెళ్లెప్పుడు అని అడిగినప్పుడల్లా తనకు పెళ్లి వద్దు కానీ.. పిల్లలు కావాలంటూ తన పెళ్లిపై వస్తున్న పుకార్లకు సమాధానం చెప్పకనే చెప్పాడు.