జీడిమెట్ల పి.యస్ పరిధిలోని చిఃతల్ లోధారుణం,నడి రోడ్డు పై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న వ్యక్తి.

తెలంగాణజీడిమెట్లలో దారుణం.. భార్య ఇంటికి రావట్లేదని.....

హైదరాబాద్: జీడిమెట్లలోని సుదర్శనరెడ్డి నగర్‌లో దారుణం చోటుచేసుకుంది. తన భార్య తనను విడిచి వెళ్లిపోయిందనే కారణంతో ఓ వ్యక్తి తన ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వివరాల్లోకెళితే.. జీడిమెట్ల పియస్ పరిధిలో చింతల్, సుదర్శన రెడ్డి నగర్‌లో భువన్ సూర్య(30), అతని భార్య, కూతురుతో ఓ భవనంలో ఆద్దెకు నివాసం ఉంటున్నాడు. భువన్ సూర్య నగరంలోని ఓ ప్రైవేట్ కార్యాలయంలో సేల్స్ ఎగ్జిక్యూటీవ్‌గా పని చేస్తున్నాడు. భార్య వారు అద్దెకుండే భవనంలోనే బ్యూటీ పార్లర్ షాపు నడిపిస్తుంది. తరచూ భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతుండేవి. గత 20 రోజుల క్రితం భార్యాభర్తల మధ్య గొడవ జరగడంతో భార్య తన అక్క ఇంటికి వెళ్ళిపోయింది. దీంతో కోపోద్రిక్తుడైన భువనసూర్య తాగిన మైకంలో ఓ మిత్రునితో కలిసి తన భార్య ఉంటున్న‌ బందువుల ఇంటికి వెళ్ళి ఆమెను తీవ్రంగా కొట్టాడు. 
దీంతో భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు జీడిమెట్ల పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. అప్పటి నుండి భార్య తన కూతురితో భువనసూర్య వద్దకు రాకుండా తన బంధువుల ఇంటి వద్దనే ఉండిపోయింది. భువనసూర్య ఇంటికి రమ్మని ఎన్నోవిధాలుగా ప్రయత్నంచినా భార్య తన ఇంటికి రాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలో భువనసూర్య నేడు‌ మధ్యాహ్నం తాను నివాసం ఉంటున్న భవనం కిందకు వచ్చి తన ఓంటిపై పెట్రోల్ పోసుకొని‌ అగ్గిపుల్లతో నిప్పంటించుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. వెంటనే స్థానికులు భాధితుడు భువనసూర్యకు అంటుకున్న మంటలను ఆర్పేశారు. తన చావుకి ఎవరూ బాద్యులు కారని, తన దహణ సంస్కారాలకు డబ్బులు కూడా తన వద్ద లేవని సుసైడ్ నోట్ లో భువనసూర్య రాశాడు. దీనిపై సమాచారం అందుకున్న జీడిమెట్ల పోలీసులు కేసు నమోదు చేసుకొని భాధితుడిని 108  అంబులెన్స్‌లో చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. భార్యాభర్తల మధ్య గొడవే భువనసూర్య ఆత్మహత్యాయత్నంకు కారణం అని పోలీసులు, స్దానికులు భావిస్తున్నారు.
 .