ఆసిఫాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి ఆత్మ రామ్ నాయక్ గారి సౌజన్యంతో ఆసిఫాబాద్ ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులకు నిత్యావసర సరుకుల పంపిణీ చేసిన-ఎం.పి.సోయం బాపు రావు గారు

బీజేపీ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకుల పంపణి ఎం.పి.సోయం బాపు రావు చేతుల మీదుగా కొమరం భీమ్ జిల్లా ఆసిఫాబాద్ ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులకు ఆసిఫాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి ఆత్మ రామ్ నాయక్ గారి సహకారంతో నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సోయం బాబురావు గారు మాట్లాడుతూ సమాజ హితం కోసం దేశ అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తూ ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని చేరే విధంగా చేస్తున్నటువంటి జర్నలిస్టులకు ఇది కేవలం చిన్ని సహాయం మాత్రమే.  దేశంలో కరోణ మహమ్మారి విజృంభించడంతో దేశంలో కరుణ బారిన పడకుండా లాక్ విధించడంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం ప్రజలను అన్ని రకాలుగా ఆదుకుంటుందని అన్నారు కార్మికులు రైతులు కూలీలకు పనులు లేక  ఆర్థికంగా లేని నిరుపేదలకు బిజెపి కార్యకర్తలు నాయకులు అన్ని రకాలుగా అండదండలు అందించి సహాయం చేసి ఆదుకోవాలని అన్నారు .ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు జే.బీ.పౌడెల్, జిల్లా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు భువనగిరి సతీష్ బాబు ప్రధాన కార్యదర్శులు కేసరి ఆంజనేయులు గౌడ్ చర్ల మురళి పసునూరు తిరుపతి దండ నాయకుల చంద్రకాంత్ కొమురం వందన సోమ మదనయ్యా. సొల్లు లక్ష్మీ, శ్రీనివాస్ రెబ్బన మండల అధ్యక్షులు గోళం తిరుపతి తదితర నాయకులు పాల్గొన్నారు.