ఖేడ్ ఎమ్యెల్యే దౌర్జన్యాన్ని ఖండిస్తున్నాం- టీయూడబ్ల్యుజె.

 ఖేడ్ ఎమ్యెల్యే దౌర్జన్యాన్ని ఖండిస్తున్నాం- టీయూడబ్ల్యుజె.

నారాయణఖేడ్ ఎమ్యెల్యే భూపాల్ రెడ్డి...లక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించి వెయ్యి మందితో అట్టహాసంగా జన్మదిన వేడుక నిర్వహించిన ఉదంతాన్ని V6 లోకల్ రిపోర్టర్ పరమేశ్వర్ వెలుగులోకి తేగా, అతనిపై కక్ష్యగట్టి దౌర్జన్యంగా ఇంటి నిర్మాణాన్ని కూల్చేయడం సహించరానిది అని  ఈ చర్యను  టీయూడబ్ల్యుజె సంఘం తీవ్రంగా ఖండిస్తుంది అని , లాక్ డౌన్ ను విజయవంతంగా అమలు చేయాలని ఓ వైపు ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు నిస్తుండగా, మరోవైపు ఇలాంటి ఆర్భాటాలతో ఎమ్యెల్యే భూపాల్ రెడ్డి లాంటి వాళ్ళు భగ్నం చేయడం విచారకరం అని ,ఎమ్యెల్యే కూల్చి వేయించిన కట్టడాన్ని వెంటనే తిరిగి నిర్మించి ఇవ్వాలని, లేనిపక్షంలో సరైన రీతిలో గుణపాఠం చెబుతాం అని , ఈ ప్రజాస్వామిక చర్యను అన్ని వర్గాలు ఖండించాలని నగునూరి శేఖర్
(రాష్ట్ర అధ్యక్షులు),కె.విరాహత్ అలీ
(రాష్ట్ర ప్రధాన కార్యదర్శి),ఫైసల్ అహ్మద్(రాష్ట్ర కార్యదర్శి),కె.మల్లి కార్జున్ రెడ్డి(సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు),విష్ణు కుమార్
(జిల్లా కార్యదర్శి) కోరారు.