అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కుమార్తె ఇవంక కరోనా కొరెంటైన్


అంతర్జాతీయం : అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌ని కరోనా షేక్ చేస్తుంది. వైట్ హౌస్ లో వరుసగా వస్తున్న పాజిటివ్ కేసులతో హడలిపోతున్నారు. అమెరికా వైస్ ప్రెసిడెంట్ మైక్ పెన్స్ పీఏ కాటే మిల్లర్ కరోనా బారిన పడినట్టు ట్రంప్ వెల్లడించిన ఒక్కరోజులోనే ట్రంప్ కుమార్తె ఇవాంక పర్సనల్ అసిస్టెంట్‌కు కూడా కరోనా పాజిటివ్‌ రిపోర్ట్ వచ్చినట్లు తెలుస్తుంది. ఆయితే ఆమె గత రెండు నెలల నుంచి ఫోన్ ద్వారా కార్యకలపాలు నిర్వహిస్తుంది. ఆమె కొన్నిరోజులుగా ఇవాంకకు దగ్గరగా లేకపోవడంతో వైట్ హౌస్ ఊపిరి పిల్చుకుంది. ఇవాంకా భర్త జేర్డ్ కుష్నర్‌కు కరోనా పరీక్షలు నిర్వహించగా నెగిటివ్ ఫలితం వచ్చినట్టు తెలుస్తుంది. గత మూడు రోజుల నుంచి వైట్ హౌస్ లో పాజిటివ్ కేసులు నమోదవుతుండటంతో ట్రంప్ రోజు కరోనా పరీక్షలు చెయించుకుంటున్నాడు.

( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )