ఆంధ్రప్రదేశ్ లో 2 వేలకి చేరువలో కరోనా కేసులు : కొత్తగా 50 కరోనా కేసులు నమోదు


ఆంధ్రప్రదేశ్‌ : రాష్ట్రం లో కొత్తగా 50 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 1980కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర, వైద్య ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 8,666 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 50 మందికి కరోనా నిర్ధారణ అయినట్టు తెలిపింది. కొత్తగా అనంతపురం జిల్లాలో 5, చిత్తూరు జిల్లాలో 16, గుంటూరు జిల్లాలో 6, వైఎస్సార్‌ జిల్లాలో 1, కృష్ణా జిల్లాలో 1, విశాఖపట్నం జిల్లాలో 1, ప్రకాశం జిల్లాలో 2, నెల్లూరు జిల్లాలో 5, కర్నూలు జిల్లాలో 13 కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 38 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. దీంతో రాష్ట్రంలో మొత్తం డిశ్చార్జి అయినవారి సంఖ్య 925కి చేరింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 45 మంది కరోనాతో మరణించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1010 మంది కరోనాతో చికిత్స పొందుతున్నారు. ( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )