మద్యం దుకాణాల వద్ద పరిస్థితిని పరిశీలించిన సీపీ అంజనీ కుమార్

‌ 
వైన్స్‌ షాపుల వద్ద భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకున్నామని హైదరాబాద్‌ కమిషనర్‌ అంజనీ కుమార్‌ అన్నారు. బుధవారం ఆయన హైదరాబాద్‌లోని పలు మద్యం దుకాణాల వద్ద పరిస్థితిని పరిశీలించారు. నారాయణగూడ శాంతి థియేటర్‌ దగ్గర ఉన్న ఓ మద్యం దుకాణాన్ని సందర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఈ రోజు హైదరాబాద్‌లో 178 మద్యం షాపులు తెరిచారని చెప్పారు.

ప్రతి వైన్స్‌ షాపు వద్ద భౌతిక దూరం పాటించలే విధంగా చర్యలు తీసుకున్నామన్నారు. మద్యం దుకాణాల వద్ద భౌతిక దూరం పాటించండం కోసం ప్రత్యే క మార్క్‌లు వేయించామని తెలిపారు. కంటైన్మెంట్‌ ప్రాంతాలలో పటిష్ట చర్యలు తీసుకున్నామని చెప్పారు. భౌతిక దూరంతోనే కరోనాను నివారించవచ్చని, దీనికి ప్రజలు సహకరించాలని అంజనీ కుమార్‌ విజ్ఞప్తి చేశారు.