భారత కరెన్సీ పై సంచలన నిర్ణయం

బిజినెస్ , జాతీయం :  డివిడెండ్, అద్దె, బీమా చెల్లింపులు తదితర వేతనేతర చెల్లింపులపై మూలం వద్ద పన్ను మినహాయింపు (టీడీఎస్‌), మూలం వద్దే పన్ను వసూలు (టీసీఎస్‌) రేట్లను తగ్గిస్తూ ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీడీబీటీ) గురువారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. సవరించిన రేట్లు గురువారం నుంచే అమల్లోకి వచ్చినట్టు ప్రకటించింది. 2021 మార్చి 31 వరకు ఇవే రేట్లు అమల్లో ఉంటాయని తెలిపింది. ప్రతికూల పరిస్థితులను అధిగమించేందుకు గాను కంపెనీలు, పన్ను చెల్లింపుదారులకు ఊరటనిస్తూ.. టీడీఎస్, టీసీఎస్‌ రేటును ప్రస్తుత రేటుపై 25 శాతం తగ్గిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటన చేసిన మరుసటి రోజే అందుకు సంబంధించి ఆదేశాలు వెలువడ్డాయి.