ప్రతీ ఒక్కరి ఆకలి తీర్చే పనిలో నిమగ్నమైన-మలక్ పేట్ పోలీసులు

ప్రతీ ఒక్కరి ఆకలి తీర్చే పనిలో నిమగ్నమయ్యారు మలక్ పేట్ పోలీసులు

లాక్క్  డౌన్  విధించి నేటికీ మండలం రోజులు దాటిపోయింది.

 లాక్ డౌన్ ఉన్నన్ని రోజులు నిరుపేద ప్రజలు , దినసరి కూలీలు , వలస కార్మికులు , యాచకులు , పేద బ్రాహ్మణులు , ఆటో డ్రైవర్లకు , ఇలా ఆపదలో ఉన్నవారిని , ఆకలితో పస్తులు ఉండే వారిని తన పరిధిలో ఎంతమంది ఉన్నారో వారిని గుర్తించి కొంతమంది దాతల సహాయం తో వారందరికీ నిత్యావసర సరుకుల ను పంపిణీ చేయడం , వారికి మూడు పూటలా కడుపునిండా భోజనం ఏర్పాట్లను చేస్తుండడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

నగర జాయింట్ సీపీ రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో మలక్ పేట్ ఏసీపీ వెంకటరమణ , ఇన్సిపెక్టర్ సుబ్బరాజు తన సిబ్బంది తో కలసి ప్రతీ రోజు అనేక కాలనిలలో నిత్యావసర సరుకుల ను అందించడం , భోజనం ఏర్పాట్లను చేయడం , వారి కష్టాలను స్వయంగా పర్యవేక్షించడం జరుగుతుందని విధులలో భాగంగా , ఒక బాధ్యతగల వ్యక్తి గా , మాపై ఉన్నతాధికారుల సూచనలు , దాతల సహాయం తో ఎంతోమందికి అండగా నిలుస్తున్నామని , అందులో భాగంగానే ఈరోజు ముసారాంబాగ్ SBI ఆఫీసర్స్ కాలనీ లోని వెంకటేశ్వర స్వామి దేవాలయం లో ఏర్పాటు చేసిన పంపిణీ కార్యక్రమంలో సుమారు 100 మందికి పైగా నిరుపేద బ్రాహ్మణులకు దాత రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో జాయింట్ సీపీ రమేష్ రెడ్డి చేతులమీదుగా నిత్యవసర సరుకులను  పంపిణీ చేశామని , ఇంకా ఎవరైనా ఇబ్బందులు ఉన్న , ఎవరైనా దాతలు ఉన్న మమ్మల్ని సంప్రదించాలని విజ్ఞప్తి చేయడం జరిగింది.

పోలీసులు తీసుకున్న ప్రత్యేక చొరవకు అభినందనీయంమని బ్రాహామణుల ఆనందం వ్యక్తం చేశారు.

తమ వంతు బాధ్యతగా ఈ కార్యక్రమం నిర్వహించామని దాత రవీందర్ రెడ్డి అన్నారు.