చివరిరోజు తీసుకున్న ఫోటో ఇది: అంజలి

సినిమాలు : లాక్‌డౌన్‌ కొనసాగుతున్నవేళ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌ ఉంటూ తమ వృత్తిగత, వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటూ అలరిస్తున్నారు. తాజాగా హీరోయిన్‌ అంజలి తాను నటించిన ఓ సినిమా షూటింగ్‌కు సంబంధించిన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. ‘నిశ్శబ్దం సినిమా చిత్రీకరణలో భాగంగా చివరిరోజు తీసుకున్న ఫోటో ఇది’ అని ఆమె కామెంట్‌ జత చేశారు. ఈ ఫోటోలో.. ప్రధాన పాత్రలో నటించిన అనుష్క ముఖానికి, మరో నటుడు సుబ్బరాజు ముఖానికి రక్తం మరకలు ఉండటం గమనించవచ్చు. ఈ ఫోటోను చూస్తే చివరిరోజు ఏదో యాక్షన్‌ సన్నివేశాన్ని తీసినట్లు తెలుస్తోంది. ఇక ఈ మూవీలో అంజలి శక్తివంతమైన పోలీసాఫీసర్ పాత్రలో నటించిన విషయం తెలిసిందే.