ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ .. తన తండ్రి సత్యమూర్తి జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా తన తండ్రితో దిగిన ఫొటోలను పోస్ట్ చేసిన డీఎస్పీ.. ఆయనను ఎంతగానో మిస్ అవుతున్నామని పేర్కొన్నారు. సన్నాఫ్ సత్యమూర్తి అని చెప్పుకోవడం ఎప్పుడు గర్వంగా ఉంటుందన్నారు. ఆయన బర్త్ డే రోజును మ్యూజికల్‌గా జరుపుకుందామని చెప్పిన దేవి.. అభిమానుల కోసం తన షోలకు సంబంధించిన కొన్ని ప్రదర్శనలను సోషల్ మీడియాలో షేర్ చేస్తానని చెప్పారు.
తొలుత యూఎస్ఏలో ఓ షో కోసం శ్రద్దా దాస్‌తో కలిసి రాఖీ రాఖీ సాంగ్ రిహార్సల్ చేస్తున్న వీడియోను దేవి శ్రీ పోస్ట్ చేశారు. రిహార్సల్‌కు, ఫైనల్ షోకు మధ్య నాకు తేడా తెలియదని అన్నారు. నాకు తెలిసిందల్లా.. ప్రేమతో పర్ఫామెన్స్ అందించడమేనని పేర్కొన్నారు. అది తనకు నెర్పించిన తన తండ్రికి కృతజ్ఞతలు తెలిపిన దేవి.. మ్యూజికల్ బర్త్ డే విషెస్ తెలియజేశారు. కాగా, దేవికి తన తండ్రి సత్యమూర్తిపై ఎంత ప్రేమ ఉందో అందరికి తెలిసిందే. పలు వేడుకలపై దేవి తన తండ్రిపై ఇష్టాన్ని వ్యక్తపరిచారు కూడా. అనారోగ్య కారణాలతో సత్యమూర్తి కొన్నేళ్ల కిందట మృతిచెందారు. ‘ఏ కష్టం ఎదురొచ్చినా...’ అంటూ సాగే పాటను రచించిన దేవి.. తన తండ్రిపై ప్రేమను అందులో వ్యక్తపరిచారు. ఈ సాంగ్‌ను దేవి తన సోదరుడు సాగర్‌తో కలిసి పాడారు.