దేశ్ కో బచావో అంటూ దేశ ఆర్థిక వ్యవస్థ కోసం ఈరోజు సీఎం లతో మీడియా కాన్పరెన్స్ : పీఎం మోడీ


జాతీయం : దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ రోజు రోజు అధికంగా వ్యాప్తి చెందుతుంది . కరోనా కట్టడికి కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించిన కరోనా కేసులు బయట పడటం ఆగట్లే , ఈ నేపథ్యంలోవివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సమావేశం కానున్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు ఈ సమావేశం ప్రారంభంకానుంది. సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడం ఇది ఐదో సారి. ఆయా రాష్ట్రాల్లో కరోనా నియంత్రణ చర్యలు ప్రధానంగా చర్చకు వస్తాయని భావిస్తున్నారు. వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా కేంద్రం ఇచ్చిన కొద్దిపాటి నిధుల వినియోగంతో పాటు, భవిష్యత్ నిధులపైనా చర్చ జరిగే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మూడో లాక్‌డౌన్ ఈనెల 17న ముగుస్తుంది. మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లో రోజు రోజుకూ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్న తరుణంలో లాక్‌డౌన్ పొడిగింపు ప్రధాన చర్చనీయాంశం కాబోతోంది. దీంతో అంత త్వరగా లాక్‌డౌన్ ఎత్తేసే అవకాశం లేదని తెలుస్తోంది. ఈనెల 29 వరకు లాక్‌డౌన్ పొడిగించిన తెలంగాణ రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు లాక్‌డౌన్‌ 3.0 ప్రకటన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ కొన్ని సడలింపులు ఇచ్చిన విషయం తెలిసిందే. దేశంలోని 734 జిల్లాలను రెడ్‌, ఆరెంజ్‌, గ్రీన్‌ జోన్లుగా విభజించారు. ( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )