పాక్‌ క్రికెటర్లు ఆమిర్, హసన్‌ అలీ నిర్ణయం

పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) నుంచి కాంట్రాక్టు దక్కని క్రికెటర్లు ఆమిర్, హసన్‌ అలీ చీఫ్‌ సెలక్టర్‌ కమ్‌ కోచ్‌ మిస్బా ఉల్‌ హక్‌ ఏర్పాటు చేసిన వాట్సాప్‌ గ్రూప్‌ నుంచి వైదొలిగారు. లాక్‌డౌన్‌ పరిస్థితుల్లో ఆటగాళ్లకు ఫిట్‌నెస్, శిక్షణ తదితర తాజా సమాచారాన్ని చేరవేసేందుకు, క్రికెటర్లతో టచ్‌లో ఉండేందుకు ఈ గ్రూప్‌ను ఏర్పాటు చేశారు. అయితే కాంట్రాక్ట్‌ దక్కలేదనే అసంతృప్తితోనే వాళ్లిద్దరు గ్రూప్‌ నుంచి నిష్క్రమించినట్లు సమాచారం. ఇటీవల పీసీబీ 18 మంది క్రికెటర్లకు కాంట్రాక్టు ఇచ్చింది. అయితే కాంట్రాక్టు జాబితాలో లేని ఆటగాళ్లను కూడా టీమ్‌ సెలక్షన్‌కు పరిగణిస్తామని చీఫ్‌ సెలక్టర్‌ మిస్బా వివరణ ఇచ్చాడు.