"సాహో " తో బాలీవుడ్ బాద్షాలనే వెనక్కి నెట్టిన ప్రభాస్ :


సినిమాలు : యంగ్ రెబల్ స్టార్ టైటిల్ పాత్రలో నటించిన 'సాహో' సినిమా. 'బాహబలి' తర్వాత భారీ అంచనాలతో పాన్ ఇండియా చిత్రంగా విడుదలైన 'సాహో' చిత్రం ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేదు. కానీ బుల్లితెర ప్రేక్షకులను మాత్రం ఎంటర్‌టైన్ చే్స్తుంది. ఏప్రిల్ 25న 'సాహో' హిందీ వెర్షన్‌ను ప్రదర్శించారు. 2020లో 17వ వారంలో ఈ సినిమాకు అపూర్వ ఆదరణ దక్కింది. మొత్తంగా ఈ సినిమా 8.3 మిలియన్స్ వ్యూస్‌ను దక్కించుకుని రికార్డు క్రియేట్ చేసింది. బాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలు కూడా అంతటి ఆదరణ దక్కలేదు. దీంతో ప్రభాస్ బాలీవుడ్ హీరోలకు షాకిచ్చారని అందరూ అనుకుంటున్నారు. ప్రభాస్ తన తదుపరి చిత్రాలను పాన్ ఇండియా చిత్రాలుగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ఓ పీరియాడికల్ లవ్‌స్టోరీలో నటిస్తుండగా, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )