మిగిలిన షూట్‌ను హైదరాబాద్‌లోనే

విజయ్‌ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో ‘లైగర్‌’ (ప్రస్తుతం ప్రచారంలో ఉన్న టైటిల్‌) అనే చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో బాలీవుడ్‌ బ్యూటీ అనన్యా పాండే హీరోయిన్‌గా నటిస్తున్నారు. ముంబై బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మార్షల్‌ ఆర్ట్స్‌ ఫైటర్‌గా కనిపించనున్నారు విజయ్‌. ఇందుకోసం విజయ్‌ ప్రత్యేకSశిక్షణ కూడా తీసుకున్నారు. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన ఓ భారీ షెడ్యూల్‌ ముంబైలో జరిగిన విషయం గుర్తుండే ఉంటుంది. ఇంకా ముంబైలో కొంత షూటింగ్‌ జరపాల్సి ఉందట. కానీ ప్రస్తుతం ముంబైలో కరోనా ప్రభావం తీవ్ర స్థాయిలో ఉంది. ఇందువల్ల ముంబైలో సినిమా షూటింగ్‌లు మొదలుకావడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉందట. దీంతో మిగిలిన షూట్‌ను హైదరాబాద్‌లోనే ముంబై సెట్‌ వేసి పూర్తి చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలో ఉన్నారట పూరి అండ్‌ టీమ్‌. ఈ చిత్రం తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.