లక్డౌన్ వేల రాజుకున్న రాజకీయాలు : నిజామాబాద్ లో పోటాపోటీ


తెలంగాణ :  నిజామాబాద్ ఎమ్మెల్సీ నియోజకవర్గంలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల ఓట్లు మొత్తం 824 ఉన్నాయి. అందులో టిఆర్ఎస్ ఓట్లు 592 కాగా కాంగ్రెస్ పార్టీ ఓట్ల సంఖ్య 142, బిజెపి ఓటు బ్యాంకు 90 గా ఉంది. గత ఎంపీ ఎన్నికల్లో కెసిఆర్ కుమార్తె కవిత ను ఓడించి,బిజెపి నుండి పోటీ చేసిన ధర్మపురి అరవింద్ ఎంపీగా విజయం సాధించారు. దీంతో స్థానికంగా బిజెపి పట్టు పెంచుకోవడానికి బాగానే ప్రయత్నం చేశాడు. తాజాగా నిజామాబాద్ ఎమ్మెల్సీ స్థానానికి పోటీ చేసిన కవిత స్థానికంగా బీజేపీని బలహీనం చేయడంపై దృష్టిసారించింది. అందులో భాగంగా ఆపరేషన్ ఆకర్ష్ కు గులాబీ పార్టీ పదును పెట్టినట్లుగా సమాచారం.ఇప్పటికే బిజెపి కార్పొరేటర్లకు గాలం వేసేందుకు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తోంది టిఆర్ఎస్ పార్టీ. బిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్ ను దెబ్బకొట్టేందుకు అతని సోదరుడు ధర్మపురి సంజయ్ ను రంగంలోకి దించింది. బిజెపి కార్పొరేటర్లకు సన్నిహితంగా ఉండే ధర్మపురి సంజయ్ వారిని కారు ఎక్కించే పనిలో ఉన్నారు. పార్టీ ఫిరాయింపుల తాయిలాలపై స్థానికంగా చర్చ జరుగుతోంది. ఇప్పటికే నలుగురు బిజెపి కార్పోరేటర్లు గులాబీ పార్టీ బాట పట్టారు.స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నాటికి పదిమంది కార్పొరేటర్లను కారు ఎక్కించడమే లక్ష్యంగా టిఆర్ఎస్ పార్టీ ,ఆ పార్టీ కోసం పని చేస్తున్న ఎంపీ అరవింద్ సోదరుడు ధర్మపురి సంజయ్ పక్కా ప్లాన్ తో ముందుకు వెళ్తున్నారు. ఇదిలా ఉంటే నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా పోటీచేసిన కల్వకుంట్ల కవిత అఫిడవిట్లో తప్పుడు వివరాలు ఇచ్చారని బిజెపి ఆరోపిస్తోంది. దీనిపై చీఫ్ ఎలక్షన్ కమిషన్‌కు ఆపార్టీ ఫ్లోర్‌ లీడర్‌ రామచందర్‌రావు ఫిర్యాదు చేశారు.( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )