ఉపరితల ద్రోణి కారణంగా తెలంగాణ వ్యాప్తంగా ఉరుములు తో కూడిన వర్షాభావం


తెలంగాణ  : ఉపరితల ద్రోణి, ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో శుక్రవారం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిశాయి. మెదక్‌, సిద్దిపేట, సంగారెడ్డి, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్‌, మేడ్చల్‌-మల్కాజిగిరి, నాగర్‌కర్నూల్‌, వనపర్తి తదితర జిల్లాల్లో ఓ మోస్తరు వర్షం పడింది. వాయవ్య మధ్యప్రదేశ్‌ నుంచి దక్షిణ ఇంటీరియర్‌ కర్ణాటక వరకు ఇంటీరియర్‌ మహారాష్ట్ర, ఉత్తర ఇంటీరియర్‌ కర్ణాటక మీదుగా 0.9 కిలో మీటర్ల ఎత్తువరకు ఉపరితల ద్రోణి.. దక్షిణ అండమాన్‌ సముద్రం, దానిని ఆనుకుని ఉన్న సుమత్రా తీర ప్రాంతాల్లో మధ్యస్థ ట్రోపోస్పియర్‌ స్థాయిల ఎత్తు వరకు కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాగల మూడు రోజులు రాష్ట్రంలోని పలుచోట్ల ఈదురుగాలులు, ఉరుములతో కూడిన ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.