నష్టల్లో ముగిసిన మార్కెట్లు


ప్రపంచవ్యాపంగా నెలకొన్న ఉద్రిక్తతలకు తోడు కేంద్రం ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీలో తక్షణ ఉపశమనం లేకపోవడంతో ఈ వారం మార్కెట్‌ నష్టాల్లో ముగిసింది. అనూహ్యంగా డీఐఐలు అమ్మకాలు చేపట్టారు. 2016 మార్చి తరువాత ఈ ఏప్రిల్‌ వారు రూ.7,965.50 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను విక్రయించారు.
లాక్‌డౌన్‌ సడలింపు అనంతరం దేశీయ ఇన్వెస్టర్లు వారి దైనందిన కార్యకలాపాలకు లిక్విడిటి అవసరమైన నేపథ్యంలో విక్రయాలు పాల్పడ్డారు. రానున్న రోజుల్లో ఈ అమ్మకాలు మరింత ఎక్కువగా ఉండవచ్చు. ముఖ్యంగా జూన్‌1 నుంచి విక్రయాలు అధికంగా జరగవచ్చు. ఎఫ్‌పీఐఐలు కూడా వారి సంప్రదాయానికి  భిన్నంగా భారత్‌ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో విక్రయాలు జరపడం అశ్చరపరిచింది. అయితే ఉద్దీపనలు, రిస్క్‌ అసెట్స్‌ తదితర అంశాలతో అమెరికా మార్కెట్‌ ఎఫ్‌ఐఐలను భారీగా ఆకర్షించింది.
కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రపంచ దేశాల ప్రభుత్వాలు చైనాతో ఆర్థిక సంబంధం గురించి పునఃపరిశీస్తామనే వ్యాఖ్యలు రాబోయే కాలంలో మార్కెట్లను ఒత్తిడికి గురి చేస్తుంది. ఇప్పటికిప్పడు ఇన్వెస్టర్లను ఉత్సాహపరిచే వార్తలేవీ లేకపోవడం మార్కెట్‌ పతనం కొనసాగే అవకాశం ఉంది. నిఫ్టీ స్వల్పకాలంలో 8500 స్థాయికి చేరుకోవచ్చు.