గోగులమూడి రాజు ఆధ్వర్యంలో మాలమహానాడు వ్యవస్థాపకులు..పి.వి.రావు గారి జయంతి.

గోగులమూడి రాజు ఆధ్వర్యంలో మాలమహానాడు వ్యవస్థాపకులు..పి.వి.రావు గారి జయంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించిన మాల యువత దాసరి రంగనాథ్ .

ఈరోజు కంకిపాడు మండలం , కుందేరు గ్రామంలో P.V.రావు మాలమహానాడు పెనమలూరు నియోజకవర్గ అధ్యక్షుడు గోగులముడి రాజు ఆధ్వర్యంలో మాలమహానాడు వ్యవస్థాపక అద్యక్షుడు P.V.రావు గారి జయంతి వేడుక ఘనంగా నిర్వహించారు .

ఈ సందర్భంగా దాసరి రంగనాథ్ మాట్లాడుతూ కుందేరు గ్రామంలో కరోనా లాక్ డౌన్ వల్ల ఇబ్బంది పడుతున్న పేద ప్రజలను గోగులమూడి రాజు ఆదుకోవటం అభినందించదగ్గ విషయమని కొనియాడారు .

ఈ సందర్భంగా కుందేరు మరియు పరిసర ప్రాంతాలలో 200 మందికి కూరగాయలు మరియు కోడిగుడ్లు పంపిణి జరిగింది .

ఈ కార్యక్రమంలో మాలమహానాడు కృష్ణాజిల్లా అద్యక్షుడు వర్రె చిట్టిబాబు , రాష్ట్ర కార్యదర్శి బళ్లారి మురళి , కృష్ణాజిల్లా మాల యువత  కన్వీనర్ దాసరి రంగనాథ్ , మాలమహానాడు పెనమలూరు నియోజకవర్గ కోఆర్థినేట‌ర్  పీకా అంజిబాబు , మువ్వల జోజి , గోగులమూడి సాల్మన్ రాజు , వల్లే సత్యంనారాయణ , గంటా ఫనెష్ , జంగం రమేష్ , గోగులమూడి సురేష్ , బత్తుల నాగార్జున , గోగులమూడి శివా , మహిళ నాయకులు గోగులమూడి రూప , పీకా జ్యోతి మరియు గ్రామస్తులు పాల్గొన్నారు....