పెళ్లికి వచ్చి పార్శిగుట్టలో చిక్కుకుపోయిన ముంబై వాసులు .....మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే

పార్శిగుట్టకు చెందిన సత్యనారాయణ, సృజన దంపతుల కుమారుడి వివాహం మార్చి 19న జరిగింది.  వివాహానానికి ముంబై నుంచి 30 మంది దాకా వచ్చారు. అనంతరం 30 మందిలో పదిమంది ముంబైకి వెళ్లిపోగా 20 మంది సిటీని వీక్షించి 23న వెళ్లేందుకు ట్రైన్‌ రిజర్వేషన్‌ చేయించుకున్నారు. మార్చి 22న దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించడంతో వారు ఇక్కడే చిక్కుకుపోయారు. ఇక్కడే ఓ కిరాయి ఇంటిలో ఉంటున్నారు. ఈ విషయం ఎమ్మెల్యే దృష్టికి వెళ్లింది. స్పందించిన ఆయన వారు ముంబై వెళ్లేందుకు అయ్యే ఖర్చు లక్ష రూపాయలను భర్తిస్తానని, ఇందుకు అనుమతులివ్వాడంటూ కలెక్టర్‌ను కోరారు. తక్షణం అధికారులు స్పందించడంతో ఈ నెల 4న (సోమవారం) వారు ఇక్కడ నుంచి ముంబైకి వెళ్లారు. దేవుడిలా తమను ఆదుకున్న ఎమ్మెల్యేకు రుణపడి ఉంటామంటూ వారు భావోద్వేగంతో ముఠా గోపాల్‌కు కృతజ్ఞలు తెలిపారు.